పవన్ కు బిగ్ షాక్

పవన్ కు బిగ్ షాక్

0
79

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది…. ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉండే నేత జనసేనకు గుడ్ బై చెప్పి తెలంగాణలో కొత్తపార్టీని స్థాపించారు… జన శంఖారావం అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు పుధిపూర్ నరసింహారెడ్డి…

గతంలో ఈయన మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీకి సేవలు అందించారు… ఇక మొన్నటిదాక జనసేనకు సేవలు అందించారు… అలాంటి కీలక నేత పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం సంచలనంగా మారింది…

2018 సంవత్సరంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కొన్ని సమీకరణాలవల్ల జనసేన పార్టీ పోటీ చేయలేదు… ఇక ఇచ్చే ఎన్నికలలోపు రాష్ట్రంలో పట్టు సాధించి సొంతంగా పోటీ చేయాలని చూస్తోంది… అందుకు తగ్గట్లుగానే పాలు కార్యక్రమాలు కూడా చేస్తోంది… అలాంటి సమయంలో నరసింహారెడ్డి పార్టీనుంచి బయటకు రావడం జనసేనకు కొంత కొరతే అని అంటున్నారు…