తమిళ నటుడు విజయ్ కు ఎన్టీఆర్ ఫోన్ ఏమన్నారంటే

తమిళ నటుడు విజయ్ కు ఎన్టీఆర్ ఫోన్ ఏమన్నారంటే

0
104

హీరోలకి సినిమాల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది.. వారు కూడా బయట చాలా సరదాగా ఉంటారు. అభిమానులు మాత్రం ఇరువురు హీరోలకు కంపేర్ చేసుకుని, సినిమాలలో పోటీ పెట్టుకుంటారు.. అయితే తాజాగా ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ హీరోల మధ్య కూడా ఇదే విషయంలో అభిమానులు పోటీ పెట్టుకుంటున్నారు.

కాని ఆ పోటీ వాతావరణం ఎలా ఉన్నా హీరోల మధ్య అభిమానం చాలా ఉంటుంది.. తాజాగా దీనిని ఎన్టీఆర్ నిరూపించారు.. అవును తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘విజిల్’ చిత్రం ఇటీవల వెండి తెరపైకి వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసిన ఎన్టీఆర్, స్వయంగా ఫోన్ చేసి విజయ్ ని అభినందించారు.

ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది ఈ విషయాన్ని ఎన్టీఆర్ ప్రతినిధి కోనేరు మహేశ్, తన సోషల్ మీడియాలో వెల్లడించారు. తెలుగులో విజిల్ చిత్రాన్ని విడుదల చేసింది మహేశే. తాజాగా చెన్నై వెళ్లిన మహేశ్, విజయ్ ని కలిసి, ఆ ఫొటోను పోస్ట్ చేశారు. అప్పుడు ఎన్టీఆర్ ఫోన్ చేసి విజయ్ తో మాట్లాడారట, ఈ విషయం విజయ్ మహేష్ కు తెలియచేశారట. తెలుగులో విజయ్ నేరుగా సినిమా చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది.