మన దేశంలో రేషన్ కార్డుల వ్యవస్ద అన్నీ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలులో ఉంది.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ సరుకులు నిత్యావసర వస్తువులుగా కోటా రూపంలో ఇస్తారు, ఈ సమయంలో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కొందరు ఉద్యోగాలు పనుల నిమిత్తం వెళుతూ ఉంటారు… చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు పక్క రాష్ట్రాలకు వెళితే వారికి రేషన్ ఇక్కడ కట్ అవుతుంది..
పైగా వేలి ముద్రలు వేస్తేకాని ఇప్పుడు రేషన్ ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది రేషన్ అవకాశాన్ని కోల్పోతున్నారు. తాజాగా దీని కోసం కేంద్రం ఓ కొత్త నిర్ణయం తీసుకుంటోంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయనుంది.
వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం లోకసభకు తెలిపింది… మీరు ఎక్కడ ఉన్నా ఆదార్ కార్డ్ -రేషన్ కార్డు ఇచ్చి
సదరు రేషన్ దుకాణంలోని ఈపోస్లో వేలిముద్రలు వేసి రేషన్ పొందవచ్చు… మరి ఎలా సాధ్యం అంటే.. ఈ పోస్ యంత్రాల ద్వారా ఎవరు ఏ కార్డు దారుడు బియ్యం రేషన్ సరుకులు తీసుకున్నారో తెలుస్తుంది, వాటిని మళ్లీ స్టాక్ పాయింట్ల నుంచి ఇచ్చే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఉదాహరణకు తెలంగాణ వ్యక్తి ఆంధ్రాలో గుంటూరులో సరుకు తీసుకుంటే, దానికి నగదు రెండు రాష్ట్రాలు కేంద్రం వాటా చెల్లించుకుంటాయి. అలాగే మీకు నచ్చిన చోట రేషన్ కూడా తీసుకోవచ్చు.