బాలయ్య రూలర్ ఈవెంట్ ప్లేస్ ఫిక్స్

బాలయ్య రూలర్ ఈవెంట్ ప్లేస్ ఫిక్స్

0
98

బాలకృష్ణ నటిస్తున్న చిత్రం రూలర్… ఈ సినిమా డిసెంబరు 20 న విడుదల అవ్వనుంది.. తాజాగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు… డిసెంబర్ 14న సాయంత్రం 5 గంటలకు విశాఖ వుడా పార్క్లోని ఎమ్జీఎమ్ గ్రౌండ్స్లో గ్రాండ్గా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు… ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు.

ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.. సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ తో పాటు వేదిక కూడా నటిస్తున్నారు… అయితే ఈ సినిమాలో బాలయ్య పోలీస్ గా చేస్తున్నారు.. అయితే బాలయ్య పోలీస్ నుంచి గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది ఈ స్టోరీలో చూడాలి.

సోషల్ మీడియాలో బాలయ్య గెటప్పులు, స్టిల్స్, పోస్టర్స్, టీజర్కు విశేష స్పందన లభించింది. సి.కల్యాణ్, కేఎస్ రవికుమార్, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది… గతంలో జై సింహ కూడా హిట్ అవ్వడంతో మరో హిట్ కోసం వీరు ఇద్దరూ ఎదురుచూస్తున్నారు.