జ‌న‌సేన ఎమ్మెల్యేపై ఈ వార్త నిజ‌మేనా ఏపీలో చ‌ర్చ‌

జ‌న‌సేన ఎమ్మెల్యేపై ఈ వార్త నిజ‌మేనా ఏపీలో చ‌ర్చ‌

0
72

ఈసారి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ కేవ‌లం 23 సీట్లు గెలుచుకుంది.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది దానికి కార‌ణం 151 సీట్లు గెలుచుకోవ‌డం.. అయితే జ‌న‌సేన మాత్రం కేవ‌లం ఒక్క సీటు మాత్ర‌మే గెలుచుకుంది.. అది కూడా రాజోలు అక్క‌డ ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఎమ్మెల్యే అయ్యారు.

ఆయ‌న వైసీపీ వైపు వెళ్లే అవ‌కాశాలు చాలా ఉన్నాయి అని వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా ఆయ‌న గురించి ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది… ఆయ‌న‌వైసీపీ వైపు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారు అని వార్త‌లు గుప్పుమ‌న్నాయి.

అయితే అక్క‌డ ఆయ‌న రాజీనామా చేసి పార్టీ మారుతారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.. కాని ఆయ‌న వ‌ర్గీయులు చెప్పేదాని ప్ర‌కారం ఏపీలో రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలుపుతో ఎంతో పేరువ చ్చింది.. అధినేత ఓడిపోయి పార్టీ నాయ‌కుడు గెల‌వ‌డం కూడా చ‌రిత్ర అయింది.. అయితే ఇప్పుడు ఆయ‌న రాజీనామా చేసి వైసీపీలో చేరితే ప‌ద‌వుల కోసం చేరిన‌ట్లు అవుతుంది…

అందుకే ఆయ‌న పార్టీలో చేర‌రు అని అంటున్నారు. అంతేకాదు వైసీపీ నేత‌లు ఆయ‌న‌తో చర్చ‌లు కూడా జ‌ర‌ప‌డం లేద‌ట… కేవ‌లం ఇవ‌న్నీ ఊహ‌గానాలు మాత్ర‌మే అంటున్నారు. మొత్తానికి గ‌తంలో ఆయన కూడా చెప్పారు తాను జ‌న‌సేన‌లో ఉంటాను అని సో ఆయ‌న పార్టీ మార్పుపై వ‌స్తున్న వార్త‌లు ఉత్తిఫేక్ ..