బన్నీ సుకుమార్ సినిమాపై మరో అప్ డేట్

బన్నీ సుకుమార్ సినిమాపై మరో అప్ డేట్

0
109

టాలీవుడ్ దర్శకుల్లో షూటింగ్ కు ఎక్కువ టైం తీసుకునే వారు అంటే వెంటనే చెప్పేది త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటారు, ఆయన తన ఫర్ఫెక్ట సీన్లు కోసం మళ్లీ రీ షూట్ కూడా చేస్తారు అంటారు. ఆయన సినిమా అంటే కనీసం ఏడాది టైం అయినా పడుతుంది. ఇక అగ్రహీరోలకి కచ్చితంగా సంవత్సరం పైనే అని చెబుతారు.

కాని అల్లు అర్జున్ తో మాత్రం అల వైకుంఠాపురాన్ని ఆరు నెలలో పూర్తి చేసి చేతిలో పెడతానని మాటిచ్చాడు. అనుకున్నట్లుగానే ఈ సినిమాని పూర్తి చేస్తారు అని అనుకున్నారు.. కాని సినిమా షూటింగ్ కు మరింత టైం పట్టే అవకాశం ఉంది అంటున్నారు, అయితే సుకుమార్ తో బన్నీ డిసెంబరులో సినిమా స్టార్ట్ చేద్దాము అని అనుకున్నారు.. కాని అది ఈనెల పట్టాలు ఎక్కేలా కనిపించడం లేదని టాక్ నడుస్తోంది.

సుకుమార్ సినిమా కోసం లుక్ మార్చి, గెడ్డం , హెయిర్ స్టయిల్ లు పెంచినా.. అలా వైకుంఠపురములో ప్రమోషన్స్ కి ఇబ్బంది ఉండదని అల్లు అర్జున్ అనుకున్నాడు కాని తాజాగా మాత్రం అల వైకుంఠపురం షూటింగ్ లోనే ఉన్నాడు , సో సుకుమార్ సినిమా జనవరిలోనే స్టార్ట్ అవుతుంది అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.