కోటీ రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

కోటీ రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

0
90

పవన్ కల్యాణ్ ఈ మధ్య బీజేపీ గురించి ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా ఆయన బీజేపీ చెంత నడుస్తారు అనేలా అనుమానాలు వస్తున్నాయి.. అయితే జనసేన నేతలు కూడా ఇదే డైలమాలో ఉన్నారు.. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను ప్రశంసించడమే కాదు, ఆర్ఎస్ఎస్ ను సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు.

తాజాగా పవన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు… సాయుధ బలగాల కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్రీయ సైనిక్ బోర్డుకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మనమందరం సంఘీభావం ప్రకటించాలి అంటూ పవన్ ట్వీట్ చేశారు.

అంతేకాదు అలా పవన్ కల్యాణ్ పిలుపు ఇవ్వడమే కాదు. తనవంతుగా సైనిక సంక్షేమ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. పవన్ తీసుకున్న నిర్ణయం పై దేశ వ్యాప్తంగా చాలా మంది ఆయనని అభినందించారు. తానే స్వయంగా చెక్కులను దీనికి సంబంధించిన అధికారులను కలిసి ఇస్తానని తెలిపారు జనసేనాని . పవన్ చేసిన పనికి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.