డిస్కోరాజా సినిమాకి హైలెట్ అదేనట సీక్రెట్ లీక్

డిస్కోరాజా సినిమాకి హైలెట్ అదేనట సీక్రెట్ లీక్

0
90

సినిమాల్లో ఇటీవల స్టిల్స్ టీజర్లు ట్రైలర్లు సినిమాలో పాత్రలని సినిమా జానర్లని తెలియచేస్తున్నాయి.. చాలా వరకూ సినిమాలలో ఇదే జరుగుతోంది.. అయితే పోలీస్ పాత్ర రౌడీ పాత్ర ప్రేమ పాత్ర ఇలా ఏది అయినా తెలుస్తోంది. ఇక మాస్ మహారాజ్ రవితేజ సినిమా వస్తోంది అంటే మార్కెట్లో ఓ రేంజ్ ఎక్స పెక్టేషన్స్ ఉంటాయి అభిమానులకి.

ఈసారి ఏకంగా సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ జానర్ ట్రై చేస్తున్నాడు రవితేజ . వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా చేస్తున్నారు ఇప్పటికే టీజర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు అనేది తెలుస్తోంది.

ఎంతో శ్రమ, ఖర్చుతో ఐస్ ల్యాండ్ లో షూట్ తీసిన సన్నివేశాలు టోటల్ సినిమాకే హైలెట్ అని యూనిట్ చెబుతోంది. అయితే టీజర్ లో ఈ సీన్లు కొన్ని చూపించారు. అయితే ఇందులో రవితేజ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. టీజర్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
జనవరి 24న విడుదల కానున్న ఈ చిత్రం ఎలా అలరిస్తుందో చూడాలి.