పవన్ ను ఓ ఆట ఆడుకుంటున్న వైసీపీ

పవన్ ను ఓ ఆట ఆడుకుంటున్న వైసీపీ

0
90

జనసే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు… రేప్ చేస్తే ఉరి తీస్తారా? రెండు బెత్తం దొబ్బలు కొడితే చాలని తీర్పు చెప్పిన దత్తపుత్రుడుకి కు నా సానుభూతి అని తెలిపారు. తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నారు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబ్తుండటం దురదృష్టం అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు…

ఇటీవలే పవన్ రాయసీమలో పర్యటించినప్పుడు గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో పలు ప్రశ్నలు విద్యార్థులు వేశారు… తన అక్క రోడ్డు మీద వెళుతుంటే కొందరు ఏడిపించారని అప్పుడు తనకు వాళ్లను కత్తితో పొడిచి చంపేద్దామన్నంత కోపం వచ్చిందని అన్నారు… ఇప్పుడు ఇదే విజయసాయిరెడ్డి ప్రస్తావించారు…

అలాగే ఒక సినిమాలో హీరోగా మరో మూవీలో విలన్ గా నటిస్తే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ ఒకే సినిమాలో ఆ నటుడు కథానాయకుడిగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారని అన్నారు. అంతేకాదు ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిపారు. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయడు ద్విపాత్రాభినయం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు..