ఏపీ తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు సంచలన నిర్ణయం

ఏపీ తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు సంచలన నిర్ణయం

0
90

స్టార్ హీరోలకు అభిమానులే ప్రాణం పైగా అభిమానులు కూడా తమ దేవుడిగా ఆ హీరోని భావిస్తారు. అయితే కొన్ని కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటుతుంది.. ముఖ్యంగా మన టాలీవుడ్ లో నాలుగు కుటుంబాలకు బీభత్సమైన అభిమాన ఘనం ఉంది అనే చెప్పాలి.. ఆ హీరోలు కూడా తమ అభిమానులకోసం ఎంత దూరం అయినా వెళతారు.

కొన్నిసార్లు అభిమానులు చేసే పనులు మనసుని టచ్ చేసేలా ఉంటాయి..ఎన్టీఆర్ ఫ్యాన్స్, సొసైటీలో సహాయం కొసం ఎదురు చూసే కొందరు నిస్సహాయుల కోసం, ఎన్టీఆర్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించనున్నారు. ఇది మంచి నిర్ణయం అనే చెప్పాలి.

ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కానుంది. ఈ సంస్థ ద్వారా పేద, బడుగు బలహీన వర్గాల వారికీ, వారి శక్తిమేర సహాయం అందించనున్నారు. త్వరలోనే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇలా మన సౌత్ ఇండియాలో హీరోల అభిమానులకు సంఘాలు చాలా ఉంటాయి వారు సేవ చేస్తూనే ఉంటారు సామాజిక బాధ్యతగా వారుపని నిర్వర్తిస్తారు. దీనికి ఎన్టీఆర్ ని పిలుస్తారు అని వార్తలు వస్తున్నాయి.