విజయ్ తో భారీ చిత్రం ప్లాన్ చేసిన శంకర్ ఎప్పుడంటే

విజయ్ తో భారీ చిత్రం ప్లాన్ చేసిన శంకర్ ఎప్పుడంటే

0
96

తమిళ సూపర్ హీరో విజయ్ కెరియర్ సూపర్ స్పీడులో దూసుకుపోతోంది.. వరుసగా హిట్స్ కొట్టకుంటూ ఆయన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తాజా చిత్రం బిగిల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక తన 64వ చిత్రం టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది.ఈ మూవీలో వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు.. దీంతో ఈ సినిమాపై ఇరువురు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో ఒక రోల్ విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా, మరో రోల్ మాఫియా డాన్ గా కనిపించనున్నారట.

అయితే విజయ్ ఈ సినిమా తర్వాత మరే చిత్రం ఒకే చేయలేదు అని తెలుస్తోంది కాని విజయ్ గతంలో దర్శకుడు శంకర్ ని కలిశారు అని వీరిద్దరి మధ్య ఓ క్రేజీ కథ డిస్కషన్ జరిగింది అని.. ఆ కథని దర్శకుడు శంకర్ మరింత తీర్చిదిద్దుతున్నారు అని తెలుస్తోంది .. విజయ్ తర్వాత శంకర్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.. మరో పక్క ప్రభాస్ అని మరో పక్క విజయ్ అని కోలీవుడ్ టాలీవుడ్ వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏం చేస్తారో చూడాలి.