తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి తెలుగుదేశంలో కాస్త నెమ్మదించారు.. ఈ ఎన్నికల్లో తనయుడి ఓటమితో ఆయన అనంత రాజకీయాల్లో కాస్త వెనకబడ్డారు అనే చెప్పాలి.. ఇటీవల ఆయన తనయుడు పవన్ రెడ్డి కూడా తాము తెలుగుదేశంలోనే ఉంటాము అని, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారు అని టీడీపీ అధికారంలోకి వస్తుంది అని ఆయన తెలియచేశారు.
అయితే రాజకీయంగా కాస్త ఘాటైన విమర్శలు చేసే జేసీ దివాకర్ రెడ్డి తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. జగన్ మోహన్ రెడ్డి గట్స్ వున్న నాయకుడని అభిప్రాయ పడ్డారు. వైయస్ హయాం లో తన తండ్రి పాలనని కొనసాగిస్తే, అదే తీరులో జగన్ మోహన్ రెడ్డి తన తాతలాగా పరిపాలిస్తున్నాడని అన్నారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యల ఫై ఏమనుకున్నా పర్వాలేదు అని మరొక బాంబ్ పేల్చారు.
ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా ఆయన కామెంట్లు చేశారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్ర టైటిల్ ని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మార్చిన వర్మ, టైటిల్ సరిగ్గా పెట్టలేదని, అతనికి టైటిల్ సరిగ్గా పెట్టడం రాదు అని విమర్శించారు… రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం అని పేరు పెట్టాల్సింది అంటూ సలహా ఇచ్చారు.