సోషల్ మీడియా సృజన, స్పందించే తీరు ఆశ్చర్యపడేలా ఉంటుందని పరోక్షంగా జనసేన పార్టీ అధినేత పవన్ ను ఉద్దేశిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు… పావలాకు బెత్తం స్టార్ అని పేరు పెట్టారని ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిందని అన్నారు. అందుకే ఇకపై తనను పవర్ స్టార్ అని పిలవొద్దని పిలుపునిచ్చారని తెలిపారు. ఆలోచనల్లో పరిపక్వత లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడి పరువు గంగలో కలుపుకుంటున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు
అలాగే చంద్రబాబుపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు…. ఏపీ డెయిరీ, విశాఖ డెయిరీలో పనిచేసిన వ్యక్తి హెరిటేజ్‌లో డెయిరీ డివిజన్ హెడ్ అని ఆ సంస్థ వెబ్ సైట్లో కనిపిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ డెయిరీని చంద్రబాబునాయుడు ఒక్కో కీలు విరిచి ఎలా కుప్పకూల్చాడో ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని అన్నారు
అంతేకాదు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 13,500 కోట్లు అప్పులు తెచ్చి పసుపు-కుంకుమ, పప్పు బెల్లాలకు పంచిపెట్టారని ఎద్దేవా చేశారు… ఉల్లి ధరలు పెరిగినా, ఇంకేదైనా నిత్యావసర వస్తువు ధర ఎగిసిపడినా నిధుల కొరతతో కార్పోరేషన్ రంగంలోకి దిగలేని పరిస్థితి సృష్టించి వెళ్లారని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి…