ముగ్గురు హీరోయిన్లతో ఫైటర్ విజయ్ కు ఇక తిరుగేలేదు

ముగ్గురు హీరోయిన్లతో ఫైటర్ విజయ్ కు ఇక తిరుగేలేదు

0
90

లక్ ఫేమ్ ఉంటే వారు తిరిగి చూసుకోవక్కర్లేదు, అయితే టాలెంట్ కూడా అవసరం.. ముఖ్యంగా సినిమాల్లో అయితే ఈ రెండు ఉండాల్సిందే, తాజాగా హీరో విజయ్ దేవరకొండ విషయంలో అందరూ ఇదే అంటున్నారు వరుస హిట్ సినిమాలతో విజయ్ జోరుమీద ఉన్నారు.

తాజాగా ఆయన చేసిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు సిద్దం అవుతోంది.. తర్వాత ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చేయనున్నాడు. ఈ సినిమా వర్క్ లో పూరీ చార్మి నిర్మాతలుగా బిజీగా ఉన్నారు,

అయితే ఇటీవల ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాత కరణ్ జోహర్ ని కూడా ఇటీవల కలిశారు. కరణ్ జొహార్ ను నిర్మాణ భాగస్వామిగా చేసుకున్నారు.

విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శకుడు పూరీ ఆలోచించారు అందుకే విజయ్ కు జోడిగా జాన్వీకపూర్ సారా అలీఖాన్ ఆలియాభట్ ని చూస్తున్నారు వీరిలో ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటే వారిని ఫిక్స్ చేస్తారట.