నాని కొత్త సినిమా ఒకే చేశాడు డైరెక్టర్ ఎవరంటే

నాని కొత్త సినిమా ఒకే చేశాడు డైరెక్టర్ ఎవరంటే

0
76
Nani

నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు ఒకే చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు, తాజాగా ఆయన ఓ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారు అనేది తెలుస్తోంది. టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సాంకృత్యన్ హీరో నానితో సినిమా చేయబోతున్నారు. విజయ్ దేవరకొండతో గీతా 2 బ్యానర్ లో బన్నీవాస్ నిర్మాతగా టాక్సీవాలా సినిమా చేసిన రాహుల్ తాజాగా నానితో సినిమా ఒకే చేశారు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ లో నాని హీరోగా సినిమాకు సైన్ చేసారు. ఈ విషయం టాలీవుడ్ లో వినిపిస్తోంది అయితే టాక్సీవాలా తర్వాత డైరెక్టర్ రాహుల్ మరే సినిమా గురించి చర్చించలేదు. కథపై ఫుల్ ఫోకస్ చేశారు ఆయన, తాజాగా ఆయన నానితో సినిమా ఒకే చేశారు.

ఇకరాహుల్ గీతా-2 లో మరో చిత్రం చేసేందుకు కూడా సిద్దం అవుతున్నారు, అయితే నాని ప్రస్తుతం
దర్శకుడు ఇంద్రగంటి తో సినిమా చేస్తున్నారు ఇది ఫైనల్ కు వచ్చింది . ఆ తరువాత డైరక్టర్ శివనిర్వాణ సినిమా చేస్తారు. తర్వాత ఈ ప్రాజెక్టు వుంటుంది. అయితే ఈ లోపు గీతా-2లో మరో సినిమా రాహుల్ చేస్తారా అనే టాక్ కూడా నడుస్తోంది.