బాలీవుడ్ లో చేయను అంటున్న సమంత ఆ సినిమా వదిలేసింది

బాలీవుడ్ లో చేయను అంటున్న సమంత ఆ సినిమా వదిలేసింది

0
77

ఏ ఉడ్ లో చేసినా చివరకు బాలీవుడ్ లో నటించాలి అని కోరిక చాలా మందికి ఉంటుంది… మంచి సినిమా మార్కెట్ ఉంటుంది అనేది తెలిసిందే.. దేశం మొత్తం మీద ఫేమ్ కూడా వస్తుంది చాలా మంది హీరోయిన్లు ఇక్కడ అవకాశాల నుంచి అక్కడ వాలతారు, అలాగే ఇప్పుడు చాలా మంది భామలు అక్కడ నుంచి ఇక్కడ వాలుతున్నారు.

సౌత్ లో చూసుకుంటే తమన్నా , ఇలియానా వంటి వారు బాలీవుడ్ లోకి వెళ్లి సినిమాలు చేసి వచ్చిన వారే.
కాని కొంత మంది మాత్రం బాలీవుడ్ కు వెళ్లడం లేదు.. కేవలం సౌత్ సినిమాలు చేస్తూనే ఉంటున్నారు.. వారిలో అనుష్కా షెట్టి, నయనతార వంటి వారు ఉన్నారు. వీరు బాలీవుడ్ వైపు చూడటం లేదు. సమంత కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ ఉంది. ఈమె కూడా బాలీవుడ్ కు నో చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే వివాహం అయినా ఆమె సినిమాలు వదలలేదు.. తను ప్యాషన్ గా చేస్తోంది.
కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా యూటర్న్ ఇది సమంత తెలుగులో చేసింది. తాజాగా దీనిని హిందీలో చేయాలి అని భావిస్తున్నారు. కాని దీనికి సమంతని అడిగితే ఆమె నటించేందుకు నో చెప్పిందట, ఆమె బదులు తాప్సీని తీసుకుంటున్నారు అని టాక్ .