జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో రైతులకు మద్దతుగా సౌభాగ్య దీక్షను చేపట్టారు… రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పవన్ ఈ దీక్షను చేస్తున్నారు… అయితే ఈ దీక్షకు పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు డుమ్మా కొట్టారు…
కొద్దికాలంగా రాపాక పార్టీ తరపున ఏ కార్యక్రమం చేసినా కూడా చురుకుగా పాల్గొనడంలేదని అంటున్నారు… అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సౌభాగ్య దీక్షకు ఆయన హాజరు కాకపోవడంతో అనేక అనుమానాలు వస్తున్నాయి…
ఆయన పార్టీ మారేందుకే జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని కొందరు అంటున్నారు… అయితే జనసేన పార్టీ నాయకులు మాత్రం ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన హాజరు కాలేక పోయారని అంటున్నారు….