పవన్ కల్యాణ్ రాజకీయంగా పోరాటం చేయడానికి సిద్దం అవుతున్నారు.. అయితే పవన్ జగన్ ని ఢీ కొట్టేందుకు ఏ అస్త్రం వాడాలి, నిజంగా జగన్ వెంట 175 మంది ఎమ్మెల్యే అభ్యర్దులు 25 మంది పార్లమెంట్ అభ్యర్దులు పార్టీ పెట్టిన సమయం నుంచి ఉన్నారు.. మరి పవన్ ఎందుకు ఈ ఐదు సంవత్సరాలుగా పార్టీని రెడీ చేసుకోలేదు.
నాయకులకి కీలక పదవులు ఇవ్వడమే కాదు పార్టీ తరపున ప్రతీ సెగ్మెంట్లో ఇంచార్జ్ లని నియమించి పార్టిని క్షేత్రస్ధాయిలో ముందుకు తీసుకువెళ్లాలి అదీ లేదు. ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం. నిలదీస్తున్న మాట. నిజంగా తెలుగుదేశం పార్టీతో సమానంగా జనసేన నడిచేది కాని పవన్ మాత్రం పార్టీపై సరైన శ్రద్ద పెట్టలేదు.
అంతేకాదు పవన్ కల్యాణ్ రాజకీయంగా తీవ్రస్ధాయిలో ఇబ్బంది పడ్డారు. తన ఓటమికి సైనికులే కారణం అన్నారు. కాని పవన్ నిజంగా పార్టీ కోసం చేసింది ఏమిటి సరిగ్గా పార్టిని క్రమంలో పెట్టారా, అసలు పార్టీ కొన్ని సెగ్మెంట్లలో ఇంచార్జులు లేని పరిస్దితి ఇది పవన్ గుర్తించరా జనసైనికుడి ఆవేదన.