మొత్తానికి రామ్ గోపాల్ వర్మ అనుకున్నదే చేశాడు.. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా తీశాడు.. సినిమా పై అనేక వివాదాలు ముందు నుంచి వచ్చాయి.. అనుకున్న సమయానికి ముందు సినిమా విడుదల అవ్వలేదు, కాని రెండోసారి మాత్రం వర్మ అనుకున్నది సాధించి సినిమా విడుదల చేశాడు.. అయితే సినిమా పొలిటికల్ జానర్ అనే విమర్శలు ముందు నుంచి ఎదుర్కొంది.ఇందులో కొన్ని పాత్రలు ఇప్పటి రాజకీయ నేతలని పోలీ ఉన్నాయి అని విమర్శలు వచ్చాయి.
అయితే ఈ సినిమా మొదటి రోజు ఫుల్ జోష్ తో హౌస్ ఫుల్ గా నడిచింది . ప్రతీ ఒక్కరూ ఈ సినిమా ఎలా ఉంది అని ఆత్రుతగా చూశారు.. అయితే ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే,
చంద్రబాబును పోలిన పాత్రను ఈ చిత్రంలో పోషించిన ధనుంజయ ప్రభు హైదరాబాద్ లో ఈ మూవీని చూశాడు.. అందరూ ఆయనని చూసి చంద్రబాబు గారితో ఫోటో అవకాశం రాలేదు, మీతో అయినా ఇవ్వండి అని కోరారు. దీనికి ఆయన సంతోషంగా సెల్పీలు దిగారు.
ఈ సినిమా పై అనుకున్నదాని కంటే ఎక్కువగా పబ్లిక్ రెస్పాన్స్ బాగుందని, ఈ హాస్య చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరారు ధనుంజయ, ఈ చిత్రాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు.అయితే మళ్లీ సినిమాలు చేస్తారా అంటే కచ్చితంగా మంచి పాత్ర వస్తే నటిస్తాను అని చెప్పారు.. మరీ ముఖ్యంగా ఇటు టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీల నేతలు ఈ సినిమాని చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు