ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్నడులేని విధంగా విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారు… నేటి యువతరం అన్ని రంగాల్లో రానిస్తున్నప్పటికీ రాజకీయ రంగంలో రాణించడంలేదు…
అందుకే జగన్ రాజీయ వ్యవస్థలో మార్పులు రావాలనే ఉద్దేశంతో కొత్తవారికి ఎక్కువ అవకాశాలనుకల్పించారు.. అంతేకాదు 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన వారికి తన కేబినెట్ లో తీసుకుని చరిత్రకెక్కారు…. డిప్యూటీ సీఎంగా ఐదుగురికి అవకాశం కల్పించారు…
జగన్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాలు ఏపీ వైపు చూసేలా చేశారు… అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఫాలోకూడా అవుతున్నాయి మన పక్క రాష్ట్రం అయిన కర్నాటకలో ఎడ్యూరప్ప తన కెబినేట్ లో జగన్ తరహాలో డిప్యూటీ సీఎంలను నియమించుకోవాలని చూస్తున్నారట…
ఉప ఎన్నికల్లో గెలిచిన 11 మందికి పదవులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట… ఇప్పటికే ముగ్గురు ఉప ముఖ్యమంత్రలు ఉన్నారు… కానీ కొన్ని ఒత్తిళ్ల వలన మరో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని చూస్తున్నారట…