ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఒక్కసారి మాట ఇస్తే అది ఎంత కష్టమైనా నెరవేర్చుతారనే పేరు తెచ్చుకున్నారు… గతంలో మహిళలకు తమ పార్టీలో ఎక్కువ ప్రాధాన్య ఇస్తామని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఎక్కువ పదవులు కేటాయించారు…
అంతేకాదు అన్నిరకాలుగా మహిళలకు ప్రధాన్యత ఇచ్చేవిషయంలో ప్రభుత్వం ముందు ఉంటోంది… తాజాగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి…
ఈరెండు స్థానాలకు జగన్ మహిళలనే నియమించాలని డిసైడ్ అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఈ రెండు స్థానాల్లో ఎస్సీ బీసీలకి చెందిన మహిళలకు కేటాయించాలని చూస్తున్నారట… ఇందుకు పలువురు పేర్లను కూడా పరిశీలిస్తున్నారట…
కాగా దేశ వ్యాప్తంగా దిశా హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఇలాంటివి రాష్ట్రంలో జరుగకూడనే ఉద్దేశంలో అసెంబ్లీలో జగన్ మహిళలరక్షణ కోసం దిశ 2019 చట్టం తీసుకువచ్చారు… ఈ బిల్లు ఆమోదంకూడా పొందింది…