జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ లో ముఖ్యమంత్రి అవ్వాలనే సంకల్పం ఉండాలని అన్నారు…. కింద స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు కేడర్ ను బలోపేతం చేయాలని రాపాక అన్నారు…
సమస్యలపై కేడర్ స్పందించేలా బాధ్యతలను అప్పగించాలని చెప్పారు… అయితే అన్ని సమస్యలకు పవన్ మాత్రమే స్పందిస్తున్నారని ఆరోపించారు… దీని వల్ల పార్టీ బలోపేతం కాదని అన్నారు… అంతేకాదు ప్రతిదానికి వచ్చి ఆందోళనలు చేయడం మంచిది కాదని అన్నారు….
అలాగే తనకు షోకాజ్ నోటీసులు అందాయనే దానిపై కూడా రాపాక స్పందించారు… తనకు ఎలాంటి షోకాజ్ నోటీసులు అందలేదని తనపై వస్తున్న వార్తలు ఫేక్ అని రాపాక క్లారిటీ ఇచ్చారు…. కాగా శీతాకాల సమావేశాల్లో మరోసారి రాపాక జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే….