సౌత్ లో కోలీవుడ్ లో స్టార్ హీరో అజిత్ వరుసగా సినిమాలు చేస్తున్నారు.. హిట్ కాంబోలతో అజిత్ దూసుకుపోతున్నారు అనే చెప్పాలి.. .ప్రస్తుతం వాలిమై సినిమా చిత్రీకరణలో అజిత్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా యామీ గౌతమ్ నటించనుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఇంకో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ఇలియానాని తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.
ఇప్పటికే ఆమెతో చిత్ర యూనిట్ చర్చలు జరిపారట. ఇలియానా తెలుగులో సినిమాలు బాగానే చేసింది.. కాని తమిళంలో పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే అజిత్ అభిమాన ఘనం పెద్దది సో ఇలియానా ఈ అవకాశం తీసుకుని సినిమా చేస్తే కచ్చితంగా ఆమెకు సౌత్ ఇండియాలో మళ్లీ పునర్వైభవం వస్తుంది అంటున్నారు.