బాబుని అడ్డంగా ఇరికిస్తున్న జగన్

బాబుని అడ్డంగా ఇరికిస్తున్న జగన్

0
85

అసెంబ్లీలో వాడీవేడిగా శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి… ఇటు జగన్ చంద్రబాబు మధ్య వార్ పీక్ స్టేజ కు వెళుతోంది పొలిటికల్ గా అనే చెప్పాలి. తాజాగా అసెంబ్లీలో దళితుల ఎస్సి, ఎస్టీ కమిషన్ గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు అడ్డుపడటం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీలో దాదాపు 36 ఎస్టీ ఎస్టీ సెగ్మెంట్లు ఉంటే టీడీపీ గెలిచింది కేవలం ఒక్క సీటు మాత్రమే, అయినా చంద్రబాబు ఇంకా మారలేదు నోరు తెరిస్తే అన్నీ అబద్దాలు చెబుతున్నారు అని విమర్శించారు..గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని కూడా ప్రశ్నించారు. ఇవన్నీ జగన్ గుర్తు చేశారు.

చంద్రబాబు తన పాలన సమయంలో దళితులకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు అని విమర్శించారు
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, 60 శాతం ఎస్సి, ఎస్టీ, మైనారిటీ లకు కేబినెట్లో స్ధానం కల్పించామని గుర్తు చేసారు. ఒక దళిత మహిళకి హోంమంత్రి గా స్ధానం కల్పించామని, ఆ ఘనత తమదేనని తెలిపారు జగన్. మొత్తానికి అన్నీ రకాలుగా బాబుని జగన్ సెంటర్ చేస్తున్నారు అనే చెప్పాలి.