బాలయ్య బాబు రూలర్ సినిమాతో వస్తున్నారు.. ఇప్పుడు తాజాగా బోయపాటితో కూడా కొత్త సినిమా పట్టాలెక్కించారు.. సుమారు 70కోట్ల రూపాయతో ఈ సినిమా తీయనున్నారు అని తెలుస్తోంది..
ఈచిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయకిగా బాలీవుడ్ స్టార్ నటి సొనాక్షి సిన్హాను తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి.
కాని ఆమె తాాజాగా దీనికి పై క్లారిటీ ఇచ్చింది.. తాను ఈ సినిమా చేయడం లేదు అని ఇక తాను ఏ సినిమా చేయబోతున్నానో త్వరలో క్లారిటీ ఇస్తాను అని చెప్పింది సోనా. దీంతో ఇంతకీ బాలయ్యకు జోడీ ఎవరనే విషయంపై మళ్లీ చర్చ మొదలైంది.
ఇఫ్పటికే ఇద్దరు ముగ్గురిని బోయపాటి ఫైనల్ చేసుకుని లిస్ట్ లో ఉంచుకున్నారు అని తెలుస్తోంది.. అయితే సౌత్ లోనే హీరోయిన్ చూడాలి అని భావిస్తున్నారట… మరో పక్క శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈమె ఫైనల్ అవునా కాదా అనేది మరో వారంలో తేలిపోనుందట .హిట్ కాంబో కోసం బాలయ్య బోయపాటి రెడీ అవుతున్నారు. సింహ లెజెండ్ తర్వాత వస్తున్న చిత్రం వీరికి ఇది మూడవది కావడంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.