బ‌న్నీని మ‌హేష్ ని దాటేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త రికార్డ్

బ‌న్నీని మ‌హేష్ ని దాటేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త రికార్డ్

0
107

యంగ్ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.. ప్ర‌తీ అవ‌కాశం వ‌దులుకోకుండా చేస్తున్నాడు విజ‌య్. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే కాదు నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు విజ‌య్. బాలీవుడ్ లో కూడా నేరుగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

ఇతర భాషల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ముఖ్యంగా యువత విజయ్‌ను అమితంగా అభిమానిస్తోంది. సోషల్ మీడియాలో విజయ్ తాజాగా నెలకొల్పిన రికార్డే దానికి నిదర్శనం. విజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 5 మిలియన్లకు చేరుకుంది. ఇది యంగ్ హీరోకు రికార్డ్ అనే చెప్పాలి.

టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సూపర్‌స్టార్ మహేష్ బాబుకు మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.6 మిలియన్ల మంది, మహేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా విజ‌య్ కు ఏకంగా 5 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ వ‌చ్చారు . ఒక సంవ‌త్స‌రంలో ఈ ఫీట్ సాదించాడు ఈ యంగ్ హీరో, త‌న సినిమాల స‌మాచారం గురించి ఎప్పుడూ అప్ డేట్ ఇస్తూ ఉంటాడు విజ‌య్… సో అందుకే ఆయ‌న‌ని చాలా మంది ఫాలో అవుతున్నారు.