ఓ స్పైసీ రోల్లో అనసూయ

ఓ స్పైసీ రోల్లో అనసూయ

0
73

తెలుగులో ఎంతో మంది యాంకర్స్ ఉన్నా కొందరికి వారి నటనకు స్టైల్ కు లుక్స్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు.
యాంకర్ గా దూసుకుపోతున్న వారిలో అనసూయ ఒకరు.. బుల్లితెరలో హాట్ యాంకర్ గా ఆమె పలు అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. అలాగే వరుసగా సినిమాలు కూడా చేస్తోంది. ఈ మధ్య చరణ్ సినిమా రంగస్ధలంలో ఆమెకు సుకుమార్ రంగమ్మత్త క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ పాత్రతో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది. కాని పదుల సంఖ్యలో సినిమా అవకాశాలు వచ్చినా ఆమె మాత్రం చేయకుండా మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంది.

తాజాగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండలో నటించేందుకు అంగీకరించింది…ఈ సినిమాలో అనసూయ ఓ సరికొత్త పాత్రలో కనిపించనుందట. ఓ స్పైసీ రోల్లో మెరవనుందని తెలుస్తోంది.. కేవలం అనసూయ ఇక భారీ చిత్రాల్లోనే నటించాలి అని అనుకుంటుందట. అవకాశంగా వచ్చిన అన్నీ సినిమాలు చేసేకంటే మంచి పాత్ర వచ్చిన చిత్రాలు చేస్తూ బుల్లితెర షోలు చేయాలి అని భావిస్తోంది.

రంగమార్తాండ సినిమా గురించి సోషల్ మీడియా ద్వారా కృష్ణవంశీ వెల్లడించాడు….అనసూయతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ, ఉత్సాహంగా ఉండే అనసూయ రంగమార్తండలో ఓ స్పైసీ రోల్లో కనిపించనుందని కృష్ణవంశీ ట్వీట్ చేశాడు. మొత్తానికి వంశీ ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న విషయం తెలిసిందే