పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

0
110

చాలా మంది యంగ్ హీరోలు పెళ్లి మాట ఎత్తితే అమ్మో అంటున్నారు, మరీ ముఖ్యంగా బ్యాచిలర్ హీరోలు టాలీవుడ్ లో పెరిగిపోతున్నారు, తాజాగా రాజ్ తరుణ్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. నేను చాలా రోజులుగా ప్రేమలో ఉన్నాను. నా పెళ్లి 2022లో ఉంటుంది అని రాజ్ తరుణ్ చెప్పేశారు ఓపెన్ గా … రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ఇద్దరి లోకం ఒకటే. జీఆర్ కృష్ణ దర్శకుడు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సమయంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా రాజ్ తరుణ్ ఈవ్యాఖ్యలు చేశారు.

అయితే ఇంకా రెండు సంవత్సరాలు ఈ పెళ్లికి టైం పడుతుంది అని చెప్పకనే చెప్పారు..ఇటీవలే నితిన్ గురించి పెళ్లి వార్త వచ్చింది. అలాగే ప్రభాస్ గురించి ప్రతీ వారం వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా రాజ్ తరుణ్ విషయం చర్చకు రావడంతో అతని అభిమానుల ఇంతకీ ఎవరా అమ్మాయి అంటున్నారు.

ఇక తాజాగా ఈ చిత్రం గురించి చెబుతూ స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది. టర్కీ చిత్రం లవ్ లైక్స్ కోఇన్సిడెన్సెస్ స్ఫూర్తితో మన నేటివిటీకి తగ్గట్టు మార్చి తీశాం అని తెలియచేశారు. ఇందులో ఆయన ఫోటోగ్రాఫర్ గా కనిపించనున్నాడట. మొత్తానికి మరో యంగ్ హీరో పెళ్లికి గ్రీన్ కార్డ్ ఇచ్చాడు బట్ ఇంకో రెండు సంవత్సరాలు ఆగాల్సిందే.