తన కోరికను మీడియా ముందు చెప్పిన రజనీకాంత్

తన కోరికను మీడియా ముందు చెప్పిన రజనీకాంత్

0
82

తమిళ సూపర్ స్టార్ తలైవా ఏ పాత్ర చేసినా ఆయన సినిమా వస్తోంది అంటే అభిమానులకు పండుగ అనే చెప్పాలి.. వచ్చే ఏడాది ఆయన దర్బార్ సినిమాతో ప్రేక్షకుల మందుకు వస్తున్నారు.. అయితే దర్బార్ మూవీ ప్రమోషన్స్ కూడా అద్బుతంగా జరుగుతున్నాయి.. తాజాగా ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ తీసుకువచ్చింది.

తాజాగా ఆయన మాట్లాడుతూ గత 45 ఏళ్లలో నేను దాదాపు 160 చిత్రాల్లో నటించా. ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమున్నాయా అని ఆలోచించా. ట్రాన్స్ జెండర్ పాత్ర ఒకటి మిగిలిపోయింది. అది చేయాలనుకుంటున్నా అని చెప్పారు. అయితే ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి అని ఆయన ముందు నుంచి అనుకుంటారు.. అలా అన్నీ అవకాశాలు వచ్చినవి చేసుకుంటూ సూపర్ స్టార్ స్ధాయికి ఎదిగారు రజనీకాంత్.

తాజాగా ఆయన ఈ కామెంట్ చేయడంతో మీడియా కూడా ఆయనని ప్రశ్నించింది. మరి మిమ్మల్ని ఈ పాత్ర చేయాలి అని ఎవరైనా అడిగారా అని అడిగారు.. కాని తనుకు ఎవరూ ఇలాంటి కధ పాత్ర చెప్పలేదు అని చెప్పారు. మొత్తానికి ఆయన తన కోరికను అయితే బయటపెట్టారు .

మరాఠీ సినిమాలో నటించాలనే ఆసక్తి కూడా తనకుందని రజనీకాంత్ తెలిపారు. తమ ఇంట్లో తాను మరాఠీ కూడా మాట్లాడతానని చెప్పారు. ఇక ఆయన మరాఠా కుటుంబానికి చెందిన వ్యక్తి అనేది తెలిసిందే, దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు.