తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి ఫేమ్ వచ్చింది, అయితే దర్శకుడు సందీప్ రెడ్డికి కూడా మంచి పేరు సంపాదించింది. ఈ కథ మొత్తం ఆయనదే .అయితే తర్వాత విజయ్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి.. స్టార్ హీరోగా బీజీగా మారిపోయాడు. తర్వాత పలు సినిమాలు హిట్ ట్రాక్ లో నడిచాయి.
అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో తీశారు, సినిమాను ఆయన హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ కూడా భారీ విజయం నమోదు చేసింది. అయితే సందీప్ తో తాజాగా మరో సినిమా చేయాలి అని ఆ చిత్ర నిర్మాతలు భావించారట. తాజాగా ఈ వార్త బీటౌన్ నుంచి టాలీవుడ్ వరకూ వినిపిస్తోంది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఒక కథను సందీప్ రెడ్డి వినిపించడంతో, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ వంగ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నాడు. అయితే ఈ సినిమాలో చాలా మంది కీలక నటులు నటించనున్నారట, వారితో సంప్రదింపులు జరుపుతున్నారు సందీప్. ఈ చిత్రం గురించి త్వరలో ప్రకటన చేయనున్నారు దర్శకుడు చిత్రయూనిట్.