వెంకటేష్ ను మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా

వెంకటేష్ ను మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా

0
85

మల్టీస్టారర్ చిత్రాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు విక్టరీ వెంకటేష్ … తాజాగా ఆయన వెంకీ మామ చిత్రంలో నటించారు ఫుల్ ఫ్యామిలీ జోష్ తో ఈ సినిమా ప్రమోషన్లు జరిగాయి.. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమా అని అందరూ చూసేందుకు ఎదురుచూశారు, ఇటీవల విడుదలై థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది.

అద్బుతమైన స్టోరీ, చిత్ర లైనప్ బాగుంది అని అందరూ కితాబిస్తున్నారు.. విమర్శకులు కూడా ప్రశంసలు ఇస్తున్నారు. వెంకీ మామ చిత్రం కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతోంది ..తాజాగా ఈ సినిమాపై ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. సరైన వినోదం కావాలంటే వెంకీ మామ చిత్రం చూడాల్సిందేనని ట్వీట్ చేశారు. ఈ సినిమాను నిజంగా ఎంతో ఆస్వాదించానని వెల్లడించారు.

మామ-అల్లుడు కెమిస్ట్రీతో వెంకటేశ్ గారు, నాగచైతన్య వెండితెరను జిగేల్మనిపించారని కితాబిచ్చారు. భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు పక్కాగా పండిన నికార్సయిన సినిమా వెంకీ మామ అని మహేశ్ బాబు కొనియాడారు. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అయితే ప్రిన్స్ ట్వీట్ తో చిత్ర యూనిట్ చాలా ఆనందంగా ఉన్నారు, అయితే వెంకటేష్ ప్రిన్స్ గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఇది ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే.