రేషన్ కార్డులు కట్ ఏపీలో కొత్త నిబంధనలు- మీకు ఈ వస్తువులు ఉంటే రేషన్ రాదు

రేషన్ కార్డులు కట్ ఏపీలో కొత్త నిబంధనలు- మీకు ఈ వస్తువులు ఉంటే రేషన్ రాదు

0
121
AP Ration Card

ఏపీలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ఎలా చేస్తున్నారో, అలాగే అనర్హుల కార్డులు కూడా ఏరి వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు అధికారులు.. తాజాగా పౌరసరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖలు కార్డుల అనర్హుల జాబితాను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది నుంచి రేషన్ పంపిణీ పారదర్శకంగా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా వీటిని కొలమానంగా అధికారులు చూస్తున్నారు అని తెలుస్తోంది మరి ఆ నిబంధనలు ఏమిటి చూస్తే. అర్బన్లో రూ.12 వేలు, రూరల్లో రూ.10 వేలు నెల జీతాలు వస్తున్నాయా అయితే ఒకే అంతకంటే ఎక్కువ జీతాలు వస్తే మీకు రేషన్ కార్డులు కట్ చేస్తారట. అంతేకాదు సొంతంగా కారు ఉంటే మీకు రేషన్ రాదు,

మున్సిపాల్టీల్లో 750 చదరపు అడుగుల ఇళ్లు అలాగే మీకు నెలకి 350 యూనిట్లు విద్యుత్ బిల్లు దాటినా రేషన్ కార్డు ఉండదు, అలాగే , ఇన్కంటాక్స్ చెల్లిస్తున్న వారికి కూడా రేషన్ కట్ చేస్తారట, పది ఎకరాల భూమి కలిగిన వారికి రేషన్కార్డులు తొలగించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో చాలా మందికి రేషన్ కట్ అవుతుంది, సరిగ్గా పేదలకి మాత్రమే రేషన్ వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్, వీరందరూ ధనికులు కాబట్టి వీరికి రేషన్ కట్ చేయాలి అని భావిస్తున్నారు. అందుకే కొత్త కార్డులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.