మరో బయోపిక్ కు బాలయ్య రెడీ

మరో బయోపిక్ కు బాలయ్య రెడీ

0
79

తమిళనాట రాజకీయ ప్రభంజనం స్రుష్టించిన నాయకురాలు అంటే జయలలితే అని చెప్పాలి .. అమ్మ మరణంతో అక్కడ రాజకీయ అనిశ్చితి కనిపించింది. అమ్మరాజకీయ వారసులు మొత్తానికి పాలన చేస్తున్నారు..దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా, తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తలైవి అనే సినిమా తీస్తున్నారు.

అమ్మ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. అయితే జయలలిత జీవితంలో ఎం.జి.ఆర్, కరుణానిధి ముఖ్యమైన భూమిక పోషించారు. ఇప్పటికే ఎం.జి.ఆర్ గా అరవింద స్వామిని కరుణానిథిగా ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసింది చిత్రబృందం, ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందట. అందుకే ఆ పాత్ర కోసం బాలయ్య బాబుని చేయమని కోరుతున్నారట చిత్ర యూనిట్.

ఈ మేరకు నిర్మాత విష్ణు ఇందూరి ఆయనని సంప్రదించనున్నారట, ఇక శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి…కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.