మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అంటే వెంటనే చెప్పేది ఎస్ బీ ఐ ..అందుకే అందరూ చాలా మంది అందులోనే డిపాజిట్లు అకౌంట్లు తీసుకుంటారు.. మన దేశంలో కోట్లాదిమందికి అందులోనే అకౌంట్లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది కొత్త కస్టమర్లు చేరుతూ ఉంటారు, అత్యంత చౌక ధరల్లో లోన్లు కూడా ఇస్తుంది.
ఇక తాజాగా పలు కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటోంది ఎస్ బీ ఐ ..జనవరి 1, 2020 నుంచి మీ పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయవు అని చెబుతోంది, అవును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. పాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో చిప్ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వాడాలి.
ఇప్పటికే చాలా మంది ఈ కార్డులు తీసుకున్నారు ఒక వేళ అప్లై చేయకపోతే మీరు బ్యాంకుకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ లో మీరు ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త చిప్ కార్డ్ కొరియర్ లో వస్తుంది.. తప్పకుండా ఈ నెల 31 లోపు మ్యాజిస్టిక్ స్ట్రిప్ డెబిట్ కార్డ్, పాత కార్డ్‌ల స్థానంలో ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.ఇప్పటికే పాన్ లేదా ఫామ్ 60లను అప్‌డేట్ చేయని ఎస్‌బీఐ ఖాతాదారుల కార్డ్‌లను ఎస్‌బీఐ డీయాక్టివేట్ చేస్తోంది అది కూడా చెక్ చేసుకోండి.. కేవలం డిసెంబరు 31 వరకూ మాత్రమే టైమ్.