పబ్ కల్చర్ అంటే తెలిసిందే.. విచ్చలవిడిగా తాగడం ఎంజాయ్ చేయడం ఈ సమయంలో డ్రగ్స్ సరఫరా కూడా జరుగుతోంది అని పోలీసులకు సమాచారం వస్తోందీ.. దీంతో ఎస్ వోటీ పోలీసులు కూడా చాలా సార్లు వీరిని పట్టుకున్న సందర్బాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని చోట్ల సింగిల్గా వచ్చిన అబ్బాయిల కోసం నిర్వాహకులే అమ్మాయిలను సిద్ధం చేస్తారు. నచ్చిన అమ్మాయిని వెంటేసుకొని లోపల హుషారుగా చిందులేయొచ్చు.
మందులో తేలియాడొచ్చు కుదిరితే అంతకుమించి అడుగు ముందుకేయొచ్చు. తాజాగా ఓ పబ్ లో రాత్రి 11 దాటాక సీక్రెట్ సన్నివేశాలు జరుగుతున్నాయి అని తెలుసుకున్నారు , నిన్న స్కెచ్ వేసిన పోలీసులకు అక్కడ అదే సీన్ కనిపించింది. గదుల్లో అంతా కురుచదుస్తుల్లో అమ్మాయిలు.. వారితో అబ్బాయిలు కనిపించారు. 22మంది యువతులు, 9మంది యువకులని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాత్రివేళ్లలో కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందిందట.. అర్ధరాత్రుళ్లు దాటిన తర్వాత కూడా నిబంధనలను అతిక్రమించి యువతులు నృత్యం చేయడమే కాకుండా పబ్కు వచ్చేవారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి.. మొత్తానికి యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు మరి న్యూ ఇయర్ వేడుకల కోసం పబ్స్ రెడీ అవుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు.