ఎవ్వరిమాట లెక్కచేయకున్న వైసీపీ ఎంపీ

ఎవ్వరిమాట లెక్కచేయకున్న వైసీపీ ఎంపీ

0
91

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారందరు ఒక ఎత్తు అయితే ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒకఎంతని అందరు భావిస్తున్నారట… ఇటీవలే జరిగిన పార్లమెంట్ సమావేశాలనుంచి సంచలనంగా మారుతున్నారు… పార్టీ నేతల చెప్పిన మాట వినకుండా కేంద్ర నాయకులను కలటం వంటి వాటివి చేయడంతో ఆయన పార్టీ మారుతారని అందరు భావించారు…

అయితే దీనిపై రఘురామకృష్ణంరాజు క్లారిటీ ఇచ్చినప్పటికి తాను జగన్ మాట తప్ప ఎవ్వరిమాట వినని అంటున్నారట… విజయాయి రెడ్డి అలాగే మిథున్ రెడ్డిల మాటను వినకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ముఖ్యంగా జిల్లా ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి మాట అస్సలు వినకున్నారట ఆయన…

తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా గోకరాజు ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకున్నారని ఆయన మండిపడుతున్నారట… ఇందులో వైవీ హస్తం ఉందని భావించి ఆయపై గుర్రున ఉన్నారట రఘురామకృష్ణంరాజు… అయితే ఆయన ఎవరిని చూసుకుని ఇంతలా ప్రవర్తిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోందట…

కేవీపీకి వియ్యంకుడు కావడంతో రాఘురామ కృష్ణంరాజు ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు…ఇదే రాఘురామ కృష్ణంరాజుకు ధైర్యమని అన్నింటున్నారు..