అక్కినేని నాగార్జున కూడా వెంకటేష్ లా తనకు బాగా సెట్ అయ్యే పాత్రలు కథలు చేయాలి అని చూస్తున్నారు.. ఇటీవల బంపర్ హిట్ అందుకోపోయినా యావరేజ్ బేస్ లోనడిచాయి కింగ్ సినిమాలు. ఆఫీసర్, దేవదాస్, మన్మథుడు 2 చిత్రాలు అనుకున్నంత విజయం తెచ్చిపెట్టలేదు. అందుకే ఈసారి రూట్ మార్చారు నాగార్జున.
చాలా సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నారట. ఈ కథలో ఆయన వయసు మీద పడిన వ్యక్తిగా కనిపిస్తారట. పైగా అది సీరియస్ పోలీస్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. అయితే స్టోరీ నచ్చడం బలమైన కథ కథనం ఆయన పాత్ర డిఫరెంట్ గా అనిపించడంతో నాగ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట.
అయితే నాగ్ ఈ సినిమాని వయసు బట్టీ చూసుకుంటే మంచి పాత్ర అని అనుకుంటున్నారట..నూతన దర్శకుడు సొలొమన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా మ్యాటనీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. వచ్చే ఏడాది జనవరి 15 తర్వాత సినిమా స్టార్ట్ అవ్వనుంది అని తెలుస్తోంది.. అంతేకాదు కొందరు యంగ్ స్టర్స్ చిత్రంలో నటించే అవకాశం ఉందట.