మెగా హీరోతో రవితేజ సినిమా

మెగా హీరోతో రవితేజ సినిమా

0
82

టాలీవుడ్ లో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది, ముఖ్యంగా ఈ ట్రెండ్ కు చాలా సినిమాలు హిట్ అవ్వడం కూడా ప్రధాన కారణం అనే చెప్పాలి … దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లతో RRR చేస్తున్నారు.

‘వెంకీమామ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది వెంకటేష్ నాగ చైతన్య నటించారు.. తాజాగా సాయి ధరమ్ తేజ్ మల్టి స్టారర్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. .తాజాగా ప్రతీ రోజూ పండగ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూలో మెగా హీరోలలో ఎవరితో కలిసి మల్టిస్టారర్ చెయ్యాలని ఉందని అడిగితే.. వరుణ్ తేజ్ తో కలిసి నటించాలని ఉందని చెప్పాడు.

అదే మెగా ఫ్యామిలీ కాకుండా బయటి హీరోలలో ఎవరితో కలిసి మల్టిస్టారర్ చేస్తారు.. అని అడిగితే రవితేజ గారితో నటించాలని ఉందని చెప్పాడు, ఇక రవితేజగారిని ఎప్పుడు కలిసినా మనమిద్దరం ఓ సినిమా చేయాలి అని ఆయన అంటూ ఉంటారు అని చెప్పాడు తేజ్, మరి ఇద్దరూ ఎనర్జీ విషయంలో సూపర్ నిజంగా దర్శకుడు మంచి కథ రాస్తే అదిరిపోతుంది అంటున్నారు ఇద్దరి అభిమానులు.