లావణ్య త్రిపాఠి భారీగా పెట్టుబడులు ఎక్కడంటే ?

లావణ్య త్రిపాఠి భారీగా పెట్టుబడులు ఎక్కడంటే ?

0
114

ఇటీవల సినీ ప్రముఖులు నిర్మాతల ఇంటిపై ఐడీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే ..బడా నిర్మాతల ఇంటికి ఆఫీసులకి ఇలాంటివి కామన్ అనే వారు అంటారు. తాజాగా ఇలాంటి దాడులు నిర్వహిస్తూ జీఎస్టీ అధికారులు చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హీరోలు వెంకటేష్- నాని సహా సితార ఎంటర్ టైన్ మెంట్స్ – సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు చేశారు అధికారులు.

తాజాగా అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ లావణ్య ఇంటిలో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు వెరిఫై చేసినట్లు తెలుస్తోంది, అయితే ఆమె ఇంటికి ఎందుకు ఇలా అధికారులు వచ్చారు అనేదానిపై అందరూ షాక్ అయ్యారు.

అయితే సినిమాలే కాదు లావణ్య త్రిపాఠి పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. వాటికి సంబంధించి జీఎస్టీ ఎగవేసినట్లుగా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయట .. అందుకే ఆమె నివసించే జూబ్లీహిల్స్ లోని లావణ్య త్రిపాఠి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు… ఆమె వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి వచ్చారు అని తెలుస్తోంది. కాని ఆమె ఎలాంటి ఎగవేతలు చేయలేదు అని అంటున్నారు ఆమె సన్నిహితులు