వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారు… మారు మూల ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పలు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే వికేంద్రీకరణ చేయాలని చెప్పారు…
అందుకే రాజధాని నిర్మాణంపై జీఎన్ రావు కమిటీని ఏర్పాటు చేశారు… ఈ కమిటీ కూడా అదే చెప్పింది అధికార వికేంద్రీకరణ చేయాలని తెలిపింది… దీని తర్వాత జగన్ నెక్ట్స్ ప్లాన్ ఎంటంటే ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి… రానున్న రోజుల్లో 25 జిల్లాలు చేయాలని చూస్తున్నారని జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు…
అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రతిపాధన తీసుకువచ్చారని అన్నారు… అంతేకాదు విశాఖలో కార్యనిర్వాహక శాఖ భీమిలీ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని భూముల కోసం సర్వే జరుగుతోందని అన్నారు…