తెలంగాణలో మరో దారుణం 7 గురిపై అత్యాచారం

తెలంగాణలో మరో దారుణం 7 గురిపై అత్యాచారం

0
89

కల్లుదుకాణాలకి వచ్చే మహిళలపై కన్నేస్తాడు, వారిని తన ట్రాప్ లోకి దించుకుంటాడు. మాయ మాటలు కలిపి వారికి వల వేస్తాడు .. చిక్కితే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్యచేస్తాడు, అలాంటి కరుడుగట్టిన నిందితుడిని మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 17న జిల్లాలోని దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారు పంటపొలాల్లో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు.

అక్కడ నుంచి పోలీసులు విచారణ మొదలు పెట్టారు.. నవాబు పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలుగా ఆమెను గుర్తించారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాల మేరకు ఆమెపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేశారు.

పాత నేరస్తుల పనే ఇదని అనుమానించిన పోలీసులు వలవేసి ఈ నిందితుడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ నిందితుడు కల్లు కాంపౌండ్ దగ్గర మాటువేసి మహిళలను ట్రాప్ చేసేవాడని తేల్చారు.ఇలా తన వలలో పడిన వారికి నిర్మానుష్యప్రాంతానికి తీసుకువెళ్లి వారిపై అత్యాచారం చేసి చంపేస్తున్నాడు, ఇలా ఏడుగురిని ట్రాప్ లోకి వేసుకుని చంపేశాడు అని తేల్చారు. పలు విషయాలు అతని నుంచి విచారణలలో తెలుసుకుంటున్నారు పోలీసులు.