అధికారుల సమన్వయం లేకపోతే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి.. పైగా మన ప్లేస్ అయితే ఆ తప్పులకు సమాధానాలు చెప్పినా అది జరగకూడదు అని అనుకుంటాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో చేదు అనుభవం ఎదురైంది.
సీతారాం సతీసమేతంగా డెహ్రాడూన్ వెళ్లారు. తర్వాత ఆ టూర్ ముగించుకుని శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకున్నారు. స్వర్ణముఖి బ్లాకులోని 320 నెంబర్ గెస్ట్ రూమ్ ను ఆయనకు కేటాయించారు. నిన్న సాయంత్రం రాష్ట్రానికి తిరిగి వచ్చే సమయంలో ఏపీ భవన్ కు చెందిన ఓ చిరుద్యోగి వచ్చి… సార్, వసతి, భోజనం బిల్లును కట్టండి అని చెప్పారు.
దీనికి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు..రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనను బిల్లు కట్టమని అడగడం పై ఆయన ఆశ్చర్యపోయారు, ఇక ఈ బిల్లు పే చేయమని తన అనుచరులకు తెలిపారు ఆయన..అమరావతిలో ఉండే సాధారణ పరిపాలన విభాగం నుంచి మీకు స్టేట్ గెస్టుగా కాకుండా, కేటగిరి-1లో వసతి ఏర్పాటు చేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని సదరు ఉద్యోగి తెలిపారు. అయితే సార్ అమరావతి వచ్చిన తర్వాత దీని గురించి అధికారులను అడుగుతారని తెలుస్తోంది.