మనకు బాడీలో చిన్న పెయిన్ వచ్చినా వెంటనే బాడీ సహకరించడం లేదు అని పెయిన్ కిల్లర్ వేసుకుంటాము.. మనమే కాదు పండు ముసలి నుంచి యంగ్ కుర్రాడు వరకూ ఇదే.. ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా కాలు చెయ్యి నొప్పి వస్తోంది అంటే పెయిన్ కిల్లర్ వేయడం చేస్తున్నారు పేరెంట్స్ .
ఇలా తెలిసి తెలియని మందులు వాడటం అసలు సమస్య ఏమిటో తెలియకుండా మెడిసన్ తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు డాక్టర్లు , ఇక పెద్ద వారి విషయం ఎలా ఉన్నా ఈ పెయిన్ కిల్లర్స్ అధిక మోతాదులో వాడితే విషపూరితం అవుతాయి అంటున్నారు.
తాజాగా అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ పరిశోధకులు. పెయిన్ కిల్లర్లు అధిక మోతాదులో తీసుకుంటే అవి విషపూరితం అవుతాయని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు చెప్పారు. చిన్నారుల్లో ఓపియాడ్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుందని తేలిందని తెలిపారు మన ప్రపంచంలో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతున్న దేశం అమెరికా అందులో చిన్నారులు కూడా 60 శాతం మంది అదే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారట.