ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ముంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు… తనకు రాజధానిలో భూములు ఉన్నట్లు అయితే నిరూపించాలని అన్నారు… ఇటీవలే అసెంబ్లీ సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా భూమి ఉందని చెప్పారు…
దీనిపై ఆయన స్పందించారు… గతంలో తనపేరుతో 198 ఎకరాలు భూమి అమరావతిలో ఉందని పుస్తకం వేశారని ఆ తర్వాత అసెంబ్లీలో 38 ఎకరాలు భూమి ఉందని ప్రకటించారని ఆయన మండిపడ్డారు.. తనకు మూడు గజాలు ఉన్నట్లు రుజువు అయితే ఏ శిక్షకు అయినా రెడీ అని సవాల్ విసిరారు…
ఎవడో తన బినామి సురేష్ అని అనంటున్నారని ప్రత్తిపాటి ఫైర్ అయ్యారు… తనకు 38 ఎకరాలు భూమి ఉన్నట్లు అయితే ఆ భూమిని బుగ్గనకే రాసిస్తానని అన్నారు నిరూపించక పోతే బుగ్గన మంత్రిపదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు…