దిశకేసులో నిందితులకు పోస్ట్ మార్టం ముగిసింది… ముగిసిన తర్వాత ఆ నలుగురి భౌతికకాయాలు పోలీసులు వారి కుటుంబాలకు అప్పగించారు..ఈ సమయంలో కన్నీరు మున్నీరు అయ్యారు నలుగురి కుటుంబ సభ్యులు.. కేవలం ఆ గ్రామం వారు ఆ బంధువులు మినహ మరెవ్వరికి అక్కడకు రావడానికి అనుమతి ఇవ్వలేదు.. ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే వారిని అప్పగించారు.
నలుగురు నిందితుల మృతదేహాలకు వారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవుల అంత్యక్రియలు పోలీస్ బందోబస్తు మధ్య ముగిశాయి. బయట వారిని రానివ్వకుండా కుటుంబ సభ్యులు గ్రామపెద్దలు మధ్య కార్యక్రమాలు పూర్తి చేశారు, మీడియాకి కూడా ఆంక్షలు విధించారు.
ఇక జక్లేర్ గ్రామంలో ఆరిఫ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్కౌంటర్ జరిగిన 17 రోజులు తర్వాత వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇక వీరికి సంబంధించి రెండోసారి పోస్టుమార్టం జరిగింది.. ఆ నివేదికను ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం హైకోర్టుకు సమర్పిం