రాజధాని విషయంలో బొత్స మరోసారి క్లారిటీ…

రాజధాని విషయంలో బొత్స మరోసారి క్లారిటీ...

0
117

గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాజధాని రైతులకు అండగా ఉంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు తాజాగా పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఐదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు…

రాజధాని పేదప్రజల భూములు దోచుకున్నారని బొత్స ఆరోపించారు… ప్రస్తుతం రాజధాని రైతులను టీడీపీ రెచ్చగొడుతున్నారని వారి మాటలను నమ్మి మోసపోవద్దని అన్నారు… రైతులు నిరసనలను విరమించాలని ఆయన కోరారు… గత కొద్దిరోజులుగా రైతులు నిరసనలు తెలుపుతుంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు….

వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని అన్నారు… జీఎన్ రావు అందజేసిన నివేదికపై ఈనెల 27న నిపుణులతో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకుంటాని అన్నారు…