అన్ని హిట్స్ వస్తున్నా సమంత కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు.. !!

అన్ని హిట్స్ వస్తున్నా సమంత కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు.. !!

0
77

తెలుగు తెరపై ఈ తరం సావిత్రి ఎవరంటే సమంత అని ఎవరైనా చెప్పాలి.. గ్లామర్ ఒక్కటే కాదు సినిమా కి కావాల్సిన అన్ని హంగులు, కళలు సమంతకు ఉన్నాయి.. ఆమె నటించిన సినిమా తప్పకుండ హిట్ అవుతుంది.. అందుకే కాబోలు ఆమెను లక్కీ హ్యాండ్ అంటారు.. సాధారణంగా ఏ హీరోయిన్ కు అయినా.. ‘పెళ్ళైన తరువాత అప్పటి వరకూ ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది.. ఇక ఆ హీరోయిన్ కు అవకాశాలు రావు’ అని చాలామంది ఫిక్స్ అయిపోతారు.

కానీ నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సమంత సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.. పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఉంది.. గత ఏడాది ఈమె ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘యూ టర్న్’ ‘అభిమన్యుడు’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. వీటిలో ‘రంగస్థలం’ ‘మహానటి’ సినిమాలకు తాజాగా 9 ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. అయితే ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్న సమంతకు మాత్రం అవార్డు రాలేదు.

దీంతో ఆమె అభిమానులు కాస్త నిరాశ చెందారని టాక్. అయినప్పటికీ సమంతే.. సూపర్ అని చెప్పాలి. ఆమె సెలెక్ట్ చేసుకునే స్టోరీలు.. అలా ఉంటాయి.. ఆమెను అవార్డ్స్ పలకరించకపోతే ఏంటి సక్సెస్లు పలకరిస్తున్నాయి కదా అంటున్నారు అభిమానులు.. ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోన్న తమిళ సూపర్ హిట్ ’96’ లో నటిస్తుంది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని.. ముఖ్యంగా సమంత నటన అందరినీ అలరిస్తుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.