29న ప్రమాణ స్వీకారం మరి అతిధులు ఎవరంటే

29న ప్రమాణ స్వీకారం మరి అతిధులు ఎవరంటే

0
84

ఝార్ఖండ్ లో బీజేపీ ఓటమిని అంగీకరించింది, ఇక అక్కడ కొత్తగా కాంగ్రెస్ ఝార్ఖండ్ ముక్తిమోర్చా కూటమి విజయం సాధించాయి. దీంతో సీఎంగా రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు హేమంత్ సోరెన్ సిద్ధమవుతున్నారు. ఆయన సారథ్యంలోని ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) కూటమి 47 స్థానాలు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది.

ఇక తనప్రభుత్వ ఏర్పాటు విషయమై చర్చించేందుకు కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన సోరెన్.. గవర్నర్‌ ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. గవర్నర్ అందుకు అంగీకరించడంతో ఈ నెల 29న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిపారు.

ఆయనను పార్టీ శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నారు. ఇక ప్రమాణ స్వీకారానికి ఝార్ఖండ్ లో బీజేపీ నేతలతో పాటు ప్రధాని అలాగే అమిత్ షా పలువురు కేంద్రమంత్రులని పలువురు స్టేట్ సీఎంలని ఆయన ఆహ్వనించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.