ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత సెగ్మెంట్ కు వెళ్లారు.. అక్కడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
కడప జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో పర్యటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్, సొంత నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల తర్వాత వందల కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఇప్పటికే నిర్మితమైన భవనాలను ప్రారంభించారు. పట్టణంలో నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను జగన్ ప్రారంభించారు.
వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలకు జగన్ శంకుస్థాపన చేశారు. దీనిని 350 కోట్లతో నిర్మిస్తున్నారు అలాగే పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేశారు, అలాగే పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్ధ కోసం 100 కోట్లు ఇస్తామని ప్రకటించారు.
ఇంటింటికీ నీరందించే పథకానికి వెంటనే రూ. 65 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. వేంపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ. 63 కోట్లను ప్రకటించారు. అలాగే పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తామని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక సంస్థల కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ ఇచ్చిన హామీలు అన్నీ ఐదేళ్లలో పూర్తి చేస్తామని కూడా తెలిపారు , ఏ సమస్య వచ్చినా తన వారికి చెప్పాలి అని వారికి భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.