అడ్వాన్సులు వెనక్కి ఇస్తున్న దర్శకుడు పరశురామ్

అడ్వాన్సులు వెనక్కి ఇస్తున్న దర్శకుడు పరశురామ్

0
85

సినిమా హిట్ అయితే దర్శకుడి పంట పండినట్టే.. ఆ దర్శకుడి వెంట నిర్మాతలు క్యూ కడతారు.. అయితే సినిమా పట్టాలెక్కించాలి అంటే కచ్చితంగా స్టోరీ రెడీ అవ్వాలి.. ఆ హీరో డేట్స్ కుదరాలి .. అయితే టాలీవుడ్ లో గీత గోవిందం సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ పరశురామ్.. అయితే తర్వాత 18 నెలల అయినా తన తదుపరి సినిమా ప్రకటించలేదు.

అయితే ఆ సినిమా హిట్ అయిన వెంటనే చాలా మంది నిర్మాతలు పరశురామ్ కు అడ్వాన్సులు ఇచ్చారట.. కాని వాటిని తిరిగి ఇచ్చేస్తున్నారట ఆయన.. దీనికి కారణం కూడా ఉంది.. తాజాగా పరశురామ్ నాగచైతన్యతో కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో సినిమా చేయనున్నారు.. దీంతో పరశురామ్ ఇతర నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులను వడ్డీతో సహా తిరిగి ఇచ్చే పనిలో ఉన్నారట.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మోహన్ బాబు.. బీవీఎస్ ఎన్ ప్రసాద్.. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఉన్నారట.
అయితే స్టోరీల వల్ల లేట్ అయిందా, హీరోల డేట్స్ వల్ల లేట్ అయిందా తెలియదు కాని, ఈలోపు ఆయన మరో రెండు సినిమాలు చేసేవారు అని అభిమానులు చిత్ర నిర్మాతలు దర్శకులు కూడా భావిస్తున్నారట.